జుక్కల్ మండల్ లాడేగావ్ గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా వరుస దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. మంగళవారం ఒకే రోజు రెండు ఇళ్లలో దొంగతనాలు జరిగాయి. ఒకరి ఇంట్లో రూ. 50,000 నగదు, మరొకరి ఇంట్లో 30 తులాల వెండి, 1 తులం బంగారం, రూ. 2,000 నగదు పోయాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.