పిట్లం మార్కెట్ కమిటీ కార్యాలయంలో నూతన పాలక వర్గం కమిటీ తొలి సాధారణ సమావేశం నూతన చైర్మన్ చీకోటి మనోజ్ కుమార్ అధ్యక్షతన గురువారం జరిగింది. ఈ సమావేశంలో మార్కెట్ యార్డు పరిధిలో ఉన్న పలు వ్యాపార సముదాయాలు టెండర్ల ప్రక్రియను గత ప్రభుత్వం రూ. 50, 000గా నిర్ణయించింది. కానీ ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఈ పాలకవర్గం 25, 000 రూపాయలకే టెండర్లు చేయాలని చర్చించి తీర్మానించారు.