రెండు లక్షల రైతు రుణమాఫీ చారిత్రాత్మక ఘట్టం: ఎమ్మెల్యే

57చూసినవారు
రెండు లక్షల రైతు రుణమాఫీ చారిత్రాత్మక ఘట్టం: ఎమ్మెల్యే
దేశంలోనే ఒకేసారి రెండు లక్షలు రైతులు రుణమాఫీ చారిత్రాత్మక ఘట్టమని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మండలంలో ప్రసిద్ధిగాంచిన కౌలాస్ కోటపై త్రివర్ణ పతాకాన్ని సతీమణి తోట అర్చనతో కలిసి ఎగురవేశారు. అనంతరం మాట్లాడుతూ, సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తూ రైతులను రుణ విముక్తులను చేయడం చరిత్రలోనే నిలిచిపోతుందన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్