పిట్లంలో స్వచ్ఛందంగా బంద్

75చూసినవారు
పిట్లంలో స్వచ్ఛందంగా బంద్
కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలో హిందూ సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం బంద్ కు పిలుపునిచ్చాయి. దీంతో దుకాణదారులు దుకాణాలను మూసివేసి స్వచ్ఛందంగా బంద్ కు సహకరించారు. ఈ సందర్భంగా హిందూ సంఘాల నాయకులు మాట్లాడుతూ దేవాలయాలపై జరుగుతున్న దాడులకు నిరసనగా బంద్ చేపట్టినట్లు హిందూ సంఘాల నాయకులు తెలిపారు. బంద్ కు సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్