ఇటీవల కురిసిన వర్షాలకు జుక్కల్ మండలంలోని కంఠాలి, కంఠాలి తాండాలో 6 నివాసపు ఇండ్లు పాక్షికంగా కూలిపోవడంతో జుక్కల్ తహసీల్దార్ హిమబిందు, ఆర్‌ఐ రామ్‌పటేల్‌తో కలిసి అట్టి ఇండ్లను క్షేత్రస్థాయిలో బుధవారం పరిశీలించారు. కంఠాలి గ్రామంలో 5, కంఠాలి తాండాలో ఒక ఇల్లు వర్షానికి పాక్షికంగా కూలిపోయిందని, వీరికి ఆర్దిక సహాయం అందిస్తామని చెప్పారు. ఉన్నతాధికారులకు పూర్తి సమాచారంతో నివేదికలు పంపిస్తామని చెప్పారు.