పిట్లం మండలం గౌరారం గ్రామంలో ఆదివారం గ్రామ కమిటీ ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి పురస్కరించుకొని కుస్తీ పోటీలను ఘనంగా నిర్వహించారు. కుస్తీ పోటీలను తిలకించడానికి చుట్టు పక్క గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. కొబ్బరికాయ కుస్తీ నుండి ప్రారంభమైన కుస్తీ పోటీలు చివరి పోటీలో గెలిచిన మల్ల యోధునికి రూ. 3100 నగదును గ్రామ పెద్దలు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షులు, మాజీ సర్పంచ్, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.