అర్జీదారుల సమస్య పరిష్కరించేందుకు ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నదని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలోని ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు ఏర్పాటు చేసిన ప్రజావాణిలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల అర్జీలను కలెక్టర్ స్వీకరించి, వాటిపై సంబంధిత అధికారులు పరిశీలించి చర్య తీసుకునే విధంగా సూచించారు.