కామారెడ్డి మండలం తిమ్మక్ పల్లి గ్రామంలో 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతా పాలన చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సెక్రెటరీ శ్రీనివాస్, ఉపాధ్యాయులు, గ్రామస్తులు యువజన సంఘాల నాయకులు పాల్గొన్నారు.