కామారెడ్డి జిల్లా దోమకొండ మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం మధ్యాహ్నం ఓ మోస్తరు వర్షం కురిసింది. గత 20 రోజులుగా ఎలాంటి వర్షాలు పడకపోవడంతో రైతన్న నీటికి ఇబ్బంది పడాల్సి వచ్చింది. వరి నాట్లు పడ్డప్పటికీ భూగర్భ జలాల్లో నీటి శాతం తగ్గడంతో వేసిన వరి నాట్ల పొలాలు పారెందుకు ఇబ్బంది పడుతున్న సమయంలో ఈ వర్షం ఎంతో కొంత ఉపయోగపడుతుందని రైతులు ఆనందం వ్యక్తం చేశారు.