రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ బాధితురాలు సంతోషిని(38) హైదరాబాదులోని కిమ్స్ వైద్యశాలలో ఆపరేషన్ నిమిత్తమై ఓ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో వారి కుటుంబ సభ్యులు కామరెడ్డికి చెందిన ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలును సంప్రదించారు. వారికి కావలసిన రక్తాన్ని రక్తదాత మురికి వంశీకృష్ణ గురువారం తొమ్మిదవ సారి సకాలంలో రక్తాన్ని అందజేసి మహిళను కాపాడారు.