సమస్యలు పరిష్కరించాలని వైద్యాధికారికి వినతి

51చూసినవారు
సమస్యలు పరిష్కరించాలని వైద్యాధికారికి వినతి
తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ బుధవారం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ఆశా కార్యకర్తలు మండల వైద్యాధికారి యెమీమాకు వినతి పత్రం సమర్పించారు. డిమాండ్స్ డే సందర్భంగా తమకు కనీస వేతనాలు అమలు చేయాలని, ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఆశా వర్కర్ల సంఘం అధ్యక్షురాలు పద్మ, ఆశా కార్యకర్తలు సవిత రేణుక పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్