తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ఉత్తర తెలంగాణ (నార్త్ జోన్) సెక్రటరీగా కామారెడ్డి జిల్లాకు చెందిన చెల్లాపురం శ్రీకాంత్ నియమితులయ్యారు. సోమవారం రాష్ట్ర కార్యాలయంలో ఐటీ గ్లోబల్ ప్రెసిడెంట్ సందీప్ కుమార్ చేతుల మీదుగా నియామక పత్రం అందుకున్నారు. ఆయన మాట్లాడుతూ ఐటీ పరంగా జిల్లాల అభివృద్ధికి కృషి చేస్తానని ఈ అవకాశం కల్పించిన ఐటీ ప్రెసిడెంట్ కి కృతజ్ఞతలు తెలిపారు.