కామారెడ్డి పట్టణంలోని సీఎస్ఐ హైస్కూల్ పదో తరగతి 1998- 1999 బ్యాచ్ కు చెందిన విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను గుర్తు చేసుకున్నారు. చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుని ఒకరి యోగక్షేమాలు మరొకరు తెలుసుకున్నారు. 25 సంవత్సరాల తర్వాత ఇలా కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందని విద్యార్థులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.