అత్యవసరంగా కామారెడ్డిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో రక్తహీనతతో చికిత్స పొందుతున్న షేక్ అసినకి ఏబీ పాజిటివ్ రక్తం అవసరం ఉండగా ఫోన్ కాల్ తో గురువారం కామారెడ్డి జిల్లా భిక్నూర్ మండలం కాచాపూర్ గ్రామానికి చెందిన తలకొక్కుల నరేష్ వచ్చి రక్తదానం చేయడం జరిగింది.
ఈ సందర్బంగా అత్యవసరంగా రక్తదానం చేసిన రక్తదాతను కామారెడ్డి జిల్లా రక్తదాతల సేవా సమితి నిర్వాహకులు బోనగిరి శివకుమార్, ముదాం శ్రీధర్ పటేల్ లు అభినందించారు.