కామారెడ్డి పెద్ద చెరువులో యువకుడు గల్లంతు

85చూసినవారు
కామారెడ్డి పెద్ద చెరువులో యువకుడు గల్లంతు
కామారెడ్డి పెద్ద చెరువులో ఓ యువకుడు గల్లంతయ్యాడు. పోలీసులు వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రంలోని ఆర్బీ నగర్ కాలనీకి చెందిన చిన్నచెవ్వ రాములు, అతడి చిన్నకొడుకు సాయికుమార్ (24)తో కలిసి శుక్రవారం సాయంత్రం పెద్ద చెరువుకు వెళ్లారు. స్నానం చేసేందుకు సాయికుమార్ చెరువులోకి దిగగా, లోతు ఎక్కువగా ఉండడంతో ఈత రాక మునిగిపోయాడు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో దేవునిపల్లి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

సంబంధిత పోస్ట్