సీఎంఆర్ పెండింగ్ బకాయిలపై అదనపు కలెక్టర్ సమీక్ష

64చూసినవారు
సీఎంఆర్ పెండింగ్ బకాయిలపై అదనపు కలెక్టర్ సమీక్ష
డిఫాల్ట్ అయిన రైస్ మిల్లర్లు ఈనెల 27వ తేదీలోగా నగదు లేదా బియ్యం రూపంలో చెల్లించాలని అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి మిల్లర్లను ఆదేశించారు. కామారెడ్డి కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో గురువారం 2021-22, 2022-23 ఖరీఫ్ డిఫాల్ట్ రైస్ మిల్లర్లతో సీఎంఆర్ పెండింగ్ బకాయిలపై సమావేశం నిర్వహించారు. డిఫాల్ట్ అయిన రైస్ మిల్లర్లు చెల్లించకపోతే ఈ నెల 27 తేదీ తర్వాత వడ్డీతో నగదు చెల్లించడానికి అనుమతించబడుతారని చెప్పారు.

సంబంధిత పోస్ట్