కామారెడ్డి జిల్లా కేంద్ర గ్రంథాలయంలో సోమవారం డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ సూచించిన అడుగుజాడల్లో నడవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భిక్కనూరు మార్కెట్ కమిటీ ఛైర్మన్ రాజు, పాఠకులు తదితరులు పాల్గొన్నారు.