మాచారెడ్డి మండల కేంద్రంలో అంబేడ్కర్ జయంతి వేడుకలు

76చూసినవారు
మాచారెడ్డి మండల కేంద్రంలో అంబేడ్కర్ జయంతి వేడుకలు
మాచారెడ్డి మండల కేంద్రంలో సోమవారం అంబేడ్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నౌసిలాల్ ఆధ్వర్యంలో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ప్రజాస్వామ్య స్థాపనకు, దేశ ఐక్యతకు అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం కీలకమైనదని ఆయన పేర్కొన్నారు. అంబేడ్కర్ అందించిన రాజ్యాంగం వల్లే నేటి సమానత్వం, స్వేచ్ఛ సాధ్యమైందని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్