నిరుపేద కుటుంబాలకు అమ్మ ఫౌండేషన్ ప్రతినిధులు అండగా నిలిచారు. గురువారం భిక్నూర్ మండలం కాచాపూర్ గ్రామానికి చెందిన పలువురికి వారు ఆర్థిక సహాయం అందజేశారు. గ్రామానికి చెందిన ఖదీర్ కూతురు అజీమా లివర్ సమస్యతో బాధపడుతున్నారు. లివర్ మార్పిడి కోసం లక్షలాది రూపాయలు ఖర్చవుతుండడంతో వారు ఆర్థిక స్తోమత లేక ఇబ్బందులు పడుతున్నారు. విషయం తెలుసుకున్న అమ్మ ఫౌండేషన్ సభ్యులు వారి ఇంటికి వెళ్లి రూ. 5 వేలు ఆర్థిక సహాయం అందజేశారు.