
మద్యం మత్తులో కూతురిపై తండ్రి అత్యాచారం
AP: విశాఖలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కన్న తండ్రే కూతురి పట్ల అసభ్యకరంగా వ్యవహరించాడు. మద్యం మత్తులో కూతురిపై అత్యాచారం చేశారు. షిప్పింగ్ యార్డ్ ప్రాంతానికి చెందిన అప్పన్న మద్యం మత్తులో కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. స్థానికులు గమనించి అడ్డుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలికను చికిత్స నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు.