కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అయ్యప్ప దేవాలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ప్రతి బుధవారం నిర్వహించే కార్యక్రమంలో భాగంగా పేదలకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు గందె శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి గోనె శ్రీనివాస్, ఉపాధ్యక్షులు పంపరి లక్ష్మణ్, అయ్యప్ప అన్న సేవ సమితి కార్యదర్శి బసవరావ్ కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ కూర శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.