భిక్కనూరు మండల కేంద్రంలో సాయి సేవా సమితి ఆధ్వర్యంలో గురువారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక హనుమాన్ దేవాలయంలో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణానికి చెందిన మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ పురం రాజమౌళి సాయి సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదానం చేసేందుకు ముందుకు వచ్చారు. పట్టణ ప్రజలకు ఆయన దగ్గర ఉండి అన్నదానం చేశారు. సమాజంలో ఇతరులకు అన్నదానం చేయడం ఎంతో గొప్పదని చెప్పారు.