ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ఓటరు జాబితా రూపకల్పనకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిందని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అందులో భాగంగా ఓటు హక్కు కోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నామని పేర్కొన్నారు. నవంబర్ 6 వరకు దరఖాస్తులకు అవకాశం ఉంటుందన్నారు. గతంలో ఓటు హక్కు ఉన్న వారు కూడా మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.