కామారెడ్డి ఎమ్మెల్యే కేవీఆర్ ఆదేశాల మేరకు మాచారెడ్డి మండలం అన్నారం గ్రామంలో
బీజేపీ కార్యకర్తల సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్ధాగత మార్పుల్లో భాగంగా 9వ బూత్ అధ్యక్షుడిగా భాస్కర్, 10వ బూత్ అధ్యక్షుడిగా ప్రవీణ్, 11వ బూత్ అధ్యక్షుడిగా నరేష్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం
బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ కుంట లక్ష్మారెడ్డి,
బీజేపీ మండల అధ్యక్షుడు బుస్స సురేష్ బూత్ అధ్యక్షుడిని సన్మానించడం జరిగింది.