ఆరోగ్యశ్రీ ఉద్యోగుల సమ్మెలో భాగంగా బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ ఉద్యోగులు, తెలంగాణ రాష్ట్ర ఆరోగ్యశ్రీ కార్యాలయం ముట్టడించి ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కామారెడ్డి రాష్ట్ర ఎస్క్యూటివ్ మెంబర్ విష్ణువర్ధన్, జిల్లా ఉపాధ్యక్షుడు సుధీర్, జిల్లా కార్యదర్శి సాయిబాబా మాట్లాడుతూ, సమ్మె నోటీస్ ఇచ్చి 44 రోజులు గడిచినప్పటికీ ఈరోజుకి కూడా ప్రభుత్వం సమస్యల పరిష్కారానికి ఎటువంటి చొరవ చూపలేదన్నారు.