భిక్కనూరులో తై బజార్ కు వేలంపాట

57చూసినవారు
భిక్కనూరులో తై బజార్ కు వేలంపాట
భిక్కనూరు పట్టణంలో తై బజార్ కు శనివారం వేలంపాట నిర్వహించడం జరిగిందని గ్రామ సచివాలయ కార్యనిర్వహణ అధికారి మహేష్ గౌడ్ తెలిపారు. జిపిలో ఏర్పాటు చేసిన వేలంపాటలో ఎంపీవో ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో కొనసాగినట్లు చెప్పారు. వారాంతపు సంతను పట్టణానికి చెందిన నంద సిద్దేశ్ రూ. 5లక్షల 70 వేలకు, రోజువారి సంత పట్టణానికి చెందిన నంద రాములు రూ. 4లక్షల ఐదువేలకు దక్కించుకున్నట్లు తెలిపారు. ఈ వేలంపాట తై బజార్ ఏడాది పాటు ఉంటుందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్