కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం గజ్యానాయక్ తండా గ్రామ పంచాయతీ పరిధిలోని ఎంపీపీఎస్ పాఠశాలలో మంగళవారం బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు. విద్యార్థులందరూ సాంప్రదాయక దుస్తులు ధరించి పువ్వులతో బతుకమ్మలు పేర్చి బతుకమ్మ పాటలు పాడుతూ అందరిని అలరించారు. విద్యార్థులకు పాఠశాల తెలుగు ఉపాధ్యాయురాలు రాజేశ్వరి దేవి మార్గ నిర్దేశం చేశారు. తదనంతరం బతుకమ్మ నిమజ్జనం శోభాయాత్ర నిర్వహించి బతుకమ్మను నిమజ్జనం చేశారు.