కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలను మహిళలు, విద్యార్థినిలు ఉత్సాహంగా మంగళవారం నిర్వహించారు. ఆయా పాఠశాలల్లో, కళాశాలలో బతుకమ్మలను అందంగా తయారు చేసి స్థానిక చెరువుల్లో నిమజ్జనం చేశారు. అంతకుముందు మహిళలు ఆటపాటలతో హంగామా చేశారు. ప్రకృతిని ఆరాధించే పండుగ బతుకమ్మ అని, సంస్కృతి సంప్రదాయాలకు ఇతర రాష్ట్రాలకు తెలియజేస్తూ తొమ్మిది రోజులపాటు అంగరంగ వైభవంగా జరుపుకుంటారని మహిళలు తెలిపారు.