కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం తుజాల్ పూర్ గ్రామంలోని జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో వాలీ బాల్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వాలీబాల్ టోర్నమెంటును శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆటల్లో గెలుపు ఓటములు సహజమన్నారు. ఈ వాలీబాల్ టోర్నమెంట్ రెండు రోజులపాటు నిర్వహించడం జరుగుతుందన్నారు. విజేతలకు ఆదివారం బహుమతులను ప్రధానం చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. మొదటి బహుమతికి 10 వేల రూపాయలు, 2వ బహుమతికి 6 వేలు ఇవ్వడం జరుగుతుందన్నారు.