సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని షీ టీమ్ పోలీసులు వెల్లడించారు. కామారెడ్డి జిల్లా కేంద్రానికి సమీపంలోని దేవునిపల్లి జూనియర్ కళాశాలలో మంగళవారం షీటీమ్ కళాబృందం సైబర్ నేరాల నియంత్రణపై అవగాహన సదస్సు నిర్వహించారు. షీటీం, సైబర్ క్రైమ్, ఏహెచ్ టియు గురించి అవగాహన కల్పించారు. షీటీం నెం. 8712686094, సైబర్ నేరాల పట్ల టోల్ ఫ్రీ నెంబర్ 1930కు కాల్ చేసి సద్వినియోగం చేసుకోవాలన్నారు.