కామారెడ్డిలోని ప్రభుత్వ సాధారణ వైద్యశాలలో జాతీయ స్వచ్ఛంద రక్తదాతల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా 17 సంవత్సరాల నుండి వ్యక్తి గతంగా 74 సార్లు రక్తదానం చేసినందుకు ఐవీఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలుకు ఉత్తమ రక్తదాత పురస్కారాన్ని వైద్యశాల సూపరిండెంట్ ప్రొఫెసర్ రామ్ సింగ్, డాక్టర్ ఫరీద, మెడికల్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ బన్సీలాల్ లు మంగళవారం సంయుక్తంగా అందజేశారు.