అందరి సహకారంతో జిల్లా స్థాయిలో తమకు ఉత్తమ అధికారి గుర్తింపు లభించిందని భిక్నూర్ మండల ఆరోగ్య విస్తీర్ణ అధికారి వెంకటరమణ చెప్పారు. గురువారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని జిల్లా కేంద్రంలో ఆయనకు ఉత్తమ అధికారిగా ప్రశంసా పత్రం అందజేశారు. వెంకటరమణ మాట్లాడుతూ, తాము అందిస్తున్న సేవలను ఎప్పటికప్పుడు పత్రికల ద్వారా ప్రజలకు తెలియజేస్తూ తమను ఉత్తమ అధికారిగా ఎంపిక చేయడానికి కృషి చేశారని కొనియాడారు.