భిక్కనూరు మండల కేంద్రంలో గల అయ్యప్ప ఆలయంలో బుధవారం అయ్యప్ప అన్న ప్రసాద దాతలకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నప్రసాద సేవా సమితి అధ్యక్షులు వెంకట సుబ్బారావు చెప్పారు. అయ్యప్ప ఆలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. భక్తుల సహకారంతో అయ్యప్ప ఆలయంలో నిత్య అన్నప్రసాద కార్యక్రమం కొనసాగించడం జరుగుతుందన్నారు.