హిందువుల పై జరుగుతున్న దాడులను నిరసిస్తూ శనివారం భిక్నూర్ పట్టణ బందుకు పిలుపునివ్వడం జరిగిందని హిందూ ఐక్యవేదిక, రామదండు ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, బంగ్లాదేశ్ లో హిందువులపై పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇట్టి దాడులను నిరసిస్తూ బందుకు పిలుపునివ్వడం జరిగిందని చెప్పారు. వాణిజ్య, వ్యాపార సంస్థలు, విద్యాసంస్థలు మూసివేసి బందులో స్వచ్ఛందంగా పాల్గొనాలని కోరారు.