బిక్కనూర్: 9 నెలలుగా గుడ్డు బిల్లులు పెండింగ్‌

79చూసినవారు
బిక్కనూర్: 9 నెలలుగా గుడ్డు బిల్లులు పెండింగ్‌
మధ్యాహ్న భోజన కార్యక్రమంలో గుడ్లు సరఫరా చేసిన ఏజెన్సీలకు 9 నెలలుగా బిల్లులు చెల్లించకపోవడంతో కార్మికులు తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు. ఈ పరిస్థితిలో విద్యార్థులకు భోజనం అందించడంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఏజెన్సీ నిర్వాహకులు పేర్కొన్నారు. జిల్లావ్యాప్తంగా రూ.3 కోట్లు మేర బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని మధ్యాహ్న భోజన కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి వెంకటేశ్ శనివారం తెలిపారు. పెండింగ్ బిల్లులు తక్షణమే చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు.

సంబంధిత పోస్ట్