ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించడంతో రాజంపేట మండలంలో బీజేపీ పార్టీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. మండల అధ్యక్షులు సావుసాని సంపత్ రెడ్డి ఆధ్వర్యంలో బాణాసంచాలు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా సంపత్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో సైతం బీజేపీ అధికారం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.