కామారెడ్డి జిల్లా రాజంపేట మండల కేంద్రంలో శనివారం ఢిల్లీలో బీజేపీ పార్టీ ఘన విజయం సాధించిన సందర్భంగా బీజేపీ కార్యకర్తలు సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల నాయకులు మాట్లాడుతూ నరేంద్ర మోడీ నాయకత్వంలో ఢిల్లీ ప్రజలు బీజేపీకి పట్టం కట్టారు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పిట్ల శ్రీను, దగ్గరి స్వామి, కిషోర్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.