రోడ్డు ప్రమాదంలో ఇద్దరికీ గాయాలు

52చూసినవారు
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికీ గాయాలు
భిక్కనూరు మండల పరిధిలోని 44వ జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికీ గాయాలైనట్లు ఎస్సై సాయికుమార్ తెలిపారు. కామారెడ్డి పట్టణానికి చెందిన టైల్స్ మ్యానుఫ్యాక్చర్ వాహనం లేబర్ తో కలిసి మెదక్ జిల్లా కేంద్రానికి వెళ్లినట్లు తెలిపారు. అక్కడ టైల్స్ ను ఖాళీ చేసి తిరిగి వస్తుండగా వాహనం అదుపుతప్పి బోల్తా పడిందన్నారు. దీంతో అందులో ఉన్న ఇద్దరు లేబర్ కు గాయాలు కాగా చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు వివరించారు.

సంబంధిత పోస్ట్