ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని పద్మపాణి సొసైటీ ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్, లిటిల్ స్కాలర్స్ హై స్కూల్ సంయుక్తంగా కామారెడ్డిలో మంగళవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. క్యాన్సర్ ప్రభావం, లక్షణాలు, ముందస్తు నిర్ధారణ ప్రాముఖ్యతను తెలియజేస్తూ విద్యార్థులు పోస్టర్లు ప్రదర్శించారు. క్యాన్సర్ పై అవగాహన పెంచుకోవడం ద్వారా ప్రాణాలను రక్షించవచ్చని విద్యార్థులు సందేశం ఇచ్చారు.