జర్నలిస్టుల పిల్లలకు పాఠశాల ఫీజులో 50% రాయితీ ఇవ్వాలి

54చూసినవారు
జర్నలిస్టుల పిల్లలకు పాఠశాల ఫీజులో 50% రాయితీ ఇవ్వాలి
కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న జర్నలిస్టుల పిల్లలకు ఫీజులో 50% రాయితీ ఇవ్వాలని శనివారం టిడబ్ల్యూజెఎఫ్ ఆధ్వర్యంలో డీఈఓ రాజుకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా టిడబ్ల్యూజెఎఫ్ నాయకులు మాట్లాడుతూ, మా పిల్లలు ఉన్నత చదువులు చదవాలంటే ప్రైవేట్ పాఠశాలల్లో యజమాన్యాలు ఫీజులో 50 శాతంపై రాయితీ ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో వేణు, ఎర్రంకి కృష్ణమూర్తి, మోహన్, చారి తదితరులున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్