
ఉద్యోగం రావడం లేదని యువతి ఆత్మహత్య
TG: ఉద్యోగం రావడం లేదని ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన పెద్దపల్లి(D) గోదావరిఖనిలోని పవర్‌హౌజ్ కాలనీలో జరిగింది. చుంచు ప్రత్యూష(26) పీజీ వరకు చదువుకుంది. ఉద్యోగాల కోసం పోటీ పరీక్షలు రాసింది. ఉద్యోగం రాకపోవడంతో మనస్తాపం చెంది ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరేసుకుంది. కుటుంబ సభ్యులు ఆలస్యంగా చూడడంతో బుధవారం వెలుగులోకి వచ్చింది. మృతురాలి తండ్రి విఠల్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.