భిక్కనూరు మండలం అంతంపల్లిలో బుధవారం ఆర్ఐ బాలయ్య సివిల్ రైట్స్ డే నిర్వహించారు. గ్రామంలో కులమతాలకు అతీతంగా అందరూ అన్నదమ్ముల మాదిరిగా కలిసి ఉండాలని సూచించారు. కుల మతాల పేరుతో రెండు గ్లాసుల పద్ధతులను పాటించకూడదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ జగదీశ్వర్ రెడ్డి, గ్రామ మాజీ సర్పంచ్ మధు మోహన్ రెడ్డి, మాజీ ఎంపిటిసి మంజుల సంజీవరెడ్డి, విండో చైర్మన్ వెంకటరెడ్డి, యాచం సురేష్ గుప్తా గ్రామస్తులు పాల్గొన్నారు.