గ్రామాల్లో సివిల్ రైట్స్ డే కార్యక్రమాన్ని గ్రామం మధ్యలో నిర్వహించి ఎస్సీ, ఎస్టీల సమస్యలను పరిష్కరించడంతో పాటు, వారి కోసం రూపొందించిన చట్టాలు, సంక్షేమ పథకాల గురించి సంపూర్ణ అవగాహనను కల్పించాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టి కమీషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో ఎస్సీ, ఎస్టీ ల్యాండ్, అట్రాసిటీస్ కేసులపై అధికారులు, ఎస్సీ, ఎస్టీ సంఘాల సభ్యులతో కలిసి సమీక్షించారు.