
ఉరేసుకుని ఏఆర్ SI ఆత్మహత్య
తెలంగాణలో మరో పోలీస్ అధికారి ఆత్మహత్య చేసుకున్నారు. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పసరలో ఏఆర్ ఎస్సై లక్ష్మీనర్సు (38) కుటుంబ కలహాలతో ఉరేసుకుని సూసైడ్ చేసుకున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని ములుగు ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఇల్లందుకు చెందిన లక్ష్మీనర్సు 15 బెటాలియన్‌గా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.