కామారెడ్డి జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. గురువారం దీపావళి పండుగను జిల్లా ప్రజలు ఆనందోత్సాహలతో జరుపుకోవాలని చెప్పారు. చిన్నారులు బాణాసంచాలు కాల్చేటప్పుడు పెద్దలు దగ్గర ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ దీపావళి జిల్లా ప్రజల జీవితాల్లో ఎన్నో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. చీకట్లను తొలగించినట్లు ఒక్కొక్క మార్పు సాధించుకుంటూ ముందుకు వెళ్లాలి అన్నారు.