జిల్లాలో నీటి సంరక్షణ, భూగర్భ జలాలు పెంపొందించే పనులకు సంబంధించిన పూర్తి నివేదికలను క్రోడీకరించి సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. సోమవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో నీటి సంరక్షణ, భూగర్భ జలాలు పెంచే పనులు, ప్లాంటేషన్ లకు సంబంధించినవి, పూర్తి చేయబడిన, చేయవలసిన పనులను గుర్తించి పూర్తి నివేదికలను సిద్ధం చేయాలన్నారు.