లింగంపేటలో ఇన్ఫోసిస్ సంస్థ రైన్ వాటర్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో నాగన్న బావి పునరుద్ధరణ పనులను జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎస్పీ సింధుశర్మ శుక్రవారం రాత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రాచీన కట్టడాలకు పరంపర ఫౌండేషన్ ఆధ్వర్యంలో పూర్వ వైభవం తీసుకురావడం అభినందనీయమని కొనియాడారు. ప్రాచీన కట్టడాలు పునరుద్ధరణ చేయడం వల్ల భావితరాలకు పూర్వకాలం చరిత్ర తెలిసే వీలు కలుగుతుందని తెలిపారు.