జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ బుధవారం బాన్స్వాడలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థులు చదువులో చురుగ్గా ఉండేలా బోధన జరగాలని, మెనూ ప్రకారం ఆహారం అందించాలని, ఎల్లప్పుడూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులు, హాస్టల్ వెల్ఫేర్ అధికారిని ఆదేశించారు. పోటీ ప్రపంచంతో పోటీ పడేలా క్రమశిక్షణతో చదవాలని విద్యార్థినిలకు సూచించారు.