కులాంతర పెళ్లి చేసుకున్న వారు అంత్యక్రియలకు వెళితే సాంఘిక బహిష్కరణ చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధు శర్మకు ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ భాగయ్య, జిల్లా అధ్యక్షులు చిట్యాల సాయన్న. శుక్రవారం ఫిర్యాదు చేశారు. తాడ్వాయిలో మాదిగ కులానికి చెందిన ఎరుకట్ల అక్షయ, బీసీ కుర్మా కులానికి చెందిన బీర్ల అనిల్ ప్రేమించుకొని కులాంతర పెళ్లి చేసుకుంటే బహిష్కరించారన్నారు.