రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీ చైర్మన్ ను కలిసిన కాంగ్రెస్ నాయకులు

53చూసినవారు
రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీ చైర్మన్ ను కలిసిన కాంగ్రెస్ నాయకులు
రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీ చైర్మన్ గా పదవీ బాధ్యతలు తీసుకున్న కాసుల బాలరాజును భిక్నూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భీమ్ రెడ్డి సన్మానించారు. బుధవారం హైదరాబాదులో ఆయన పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా అక్కడికి వెళ్లి ఆయనను శాలువాలతో సత్కరించి పుష్పగుచ్చాలు అందజేశారు. అనంతరం భీమ్ రెడ్డి మాట్లాడుతూ, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్